ఎన్నికల తర్వాతే.. రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ

-

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ, వమో పరిమితి పెంపు వాయిదా పడ్డాయి. గురువారం తెలంగాణ ప్రభుత్వం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి, విశ్వవిద్యాలయ ఉపకులపతుల (వీసీ) నియామకం, జిల్లాల్లో శంకుస్థాపన పనులు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మార్చి వరకు నిలిచిపోనున్నాయి. ఒకవేళ నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ని ప్రభుత్వం విడుదల చేస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రయోజనాలకు తీవ్ర ఆటంకం కలుగనుంది.

Job unions

వేతనాల సవరణ, వమో పరిమితి పెంపు విషయాలపై మరికొద్ది రోజుల్లో నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్న ఉద్యోగ సంఘాలకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు అందజేశారు. ఎన్నికలు ముగిసే వరకు అభివృద్ధికి సంబంధించిన పనులను నిలిపివేయాలని, వీటిని చూసి ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఉద్యోగులకు సంబంధించిన వేతనాల పెంపు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాల అమలు కష్టమనే చెప్పవచ్చు.

మార్చిలో అసెంబ్లీ సమావేశం..
మార్చి మొదటి వారంలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు.. అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. బడ్జెట్ రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ కాబట్టి.. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సమాచారం అందించి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అయితే మార్చి 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శాసన సభ, మండలి సమావేశాలను నిర్వహించే అవకాశం లేదు. ఉద్యోగుల జీతాల పెంపు, పీఆర్‌సీ విడుదల, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 31వ తేదీన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై సీఎం కేసీఆర్ త్రిసభ్య కమిటీతో సమావేశం కూడా నిర్వహించారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో అన్ని కార్యనిర్వహణ పనులు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version