ఏపీ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు.