వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య.. యువతి అరెస్టు!

-

ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసుకు సంబంధించి మృతుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు నల్గొండకు చెందిన యువతిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా మాటామాటా కలిసి..ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.
హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని తెలిసింది.ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆమె గురించి ఎస్‌ఐ హరీష్‌ ఆరా తీయగా.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది.ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిసింది. దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయంపై మాట్లాడేందుకు ఆదివారం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు ఇద్దరు వెళ్లారు.అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

సెటిల్మెంట్ కోసం హరీష్ ట్రై చేయగా యువతి అందుకు ఒప్పుకోకుండా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమని హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news