అప్పులు చేసుకుని తింటున్నాం.. రుణమాఫీ 10 శాతం కాలేదు : రైతుల సీరియస్

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఓ అన్నదాత మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుగోలు కేంద్రాల్లో బీపీటీ రైస్ మినహా వేరేది కొనుగోలు చేయడం లేదని.. మార్కెట్లో తన బియ్యాన్ని అమ్ముకున్నానని ఓ రైతు తెలిపాడు. సీఎం రేవంత్ రుణమాఫీ చేశానని చెప్పుకుని తిరుగుతున్నానని.. వాస్తవానికి 10 శాతం కూడా రుణమాఫీ కాలేదని రైతు కుండబద్దలు కొట్టాడు.

కాంగ్రెస్ సర్కారులో రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైందని, అప్పులు తెచ్చుకొని తినవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత కేసీఆర్ హయాంలో రైతులకు మాత్రం మంచి జరిగిందని, మిగతా వాళ్లను ఆయన మోసం చేసిండేమో? కానీ అంటూ రైతు అసలు విషయాన్ని వెల్లడించాడు. రేవంత్ హయాంలో కేవలం రూ.1లక్ష లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ అయ్యిందని, రేషన్ కార్డు లేనివారికి చేస్తామని మోసం చేశారన్నారు. చాలా మందికి రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం నుంచి బిల్లలు సైతం రావడం లేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news