స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా..? అయితే కొనేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి..!

-

చాలా మంది ఈ మధ్య ఎక్కువగా స్మార్ట్ టీవీలని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారు. మీరు కూడా మీ ఇంటికి ఒక స్మార్ట్ టీవీ ని కొనాలనుకుంటున్నారా..? స్మార్ట్ టీవీ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలో పడ్డారా..? అయితే తప్పకుండా ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.

 

పెరుగుతున్న టెక్నాలజీ మరియు మార్కెట్ కాంపిటీషన్ తో స్మార్ట్ టీవీలు చాలా ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంచుకోవడం కష్టమైనప్పటికీ ఈ టిప్స్ ని ఫాలో అయితే ఎంచుకోవడం సులభం. అయితే మరి స్మార్ట్ టీవీ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ నుండి నేరుగా మీకు ఇష్టమైన సినిమాలు చూడొచ్చు. పైగా ఈ టీవీలు బ్రౌజర్ తో పాటు వస్తాయి. టీవీలో ఇంటర్నెట్ బ్రౌజ్ కూడా చేయొచ్చు. ఒకవేళ కనుక మీది స్మార్ట్ టీవీ కాకపోయి ఉంటే మీ ఎల్ఈడి లేదా ఎల్సిడి టీవీని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ కాస్ట్ లేదా ఫైర్ టీవీ స్టిక్ వంటివి ఉపయోగించి ఇంటర్నెట్ ఆక్సిస్ పొందొచ్చు. అలానే స్ట్రీమింగ్ యాప్స్ ఆక్సిస్ పొందొచ్చు.

స్మార్ట్ టీవీని ఎంచుకునేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి:

డిస్ప్లే టైపు
స్క్రీన్ సైజు
స్క్రీన్ రిసొల్యూషన్
కనెక్టివిటీ ఆప్షన్
సౌండ్
ధర

మంచి స్మార్ట్ టీవీ బ్రాండ్లను ఎంచుకుంటే మంచిది. పెద్ద కంపెనీలు అందించే స్మార్ట్ టీవీలు బాగా పనిచేస్తాయి.
స్క్రీన్ సైజ్ ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలానే మంచం లేదా టీవీ చూసే చోట నుంచి గోడకి ఎంత దూరంలో ఒక టీవీ ని ఫిక్స్ చేసుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ అది ఐదు అడుగుల కంటే తక్కువ అయితే 32 ఇంచెస్ టీవీ కొనుక్కోవడం మంచిది అదే ఐదు నుండి ఆరడుగుల మధ్యలో అయితే 43 ఇంచుల టీవీ కొనండి. ఆరు నుండి ఏడు అడుగులు అయితే 46 నుండి 50 అడుగుల టీవీని కొనచ్చు.
ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. మూడు రకాలుగా మనకి దొరుకుతున్నాయి. అవే LED, OLEDs QLEDs. OLEDs ఎక్కువ బడ్జెట్ మరియు బెస్ట్ పిక్చర్ క్వాలిటీతో ఉంటాయి. అదే ఎల్ఇడి టీవీలు అయితే తక్కువ బడ్జెట్ లో వస్తాయి. ఓఎల్ఈడీ అయితే మీడియం నుండి హై బడ్జెట్ లో ఉంటాయి. మంచి క్వాలిటీతో ఉంటాయి.
స్క్రీన్ రిసొల్యూషన్ గురించి చూస్తే.. ఎక్కువ రిసొల్యూషన్స్ ఉన్న స్క్రీన్ ని మీరు చూసుకుంటే క్వాలిటీ బాగుంటుంది.
అలానే మీరు ఆడియో కూడా బాగుందో లేదో చూసుకోండి.
కనెక్టివిటీ ఫీచర్స్ ని కూడా చూసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version