నేను సహనంగా ఉండాలి. అన్ని సమస్యలని ఎంతో హ్యాపీగా, కూల్ గా అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ అనుకోకుండా ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే ఏ సహనం లేకుండా పూర్తిగా ఆందోళన చెందుతారు. కానీ ఇటువంటి ప్రవర్తన ఉండటం మంచిది కాదు. దేనినైనా ఎంతో సహనంగా పరిష్కరించుకోవాలి. సహనంతో పరిష్కరించకుంటే ఎంతటి సమస్యనైనా చిటికెలో మాయం చేయవచ్చు. సహనాన్ని మీరు అలవాటు చేసుకోవాలి అంటే ఈ చిట్కాలు పాటించండి. ఇలా చేయడం వల్ల మీరు మీ సహనాన్ని కోల్పోకుండా ఉంటారు.
ఆగండి కాసేపు:
ఏమైనా చిన్న సమస్య వస్తే కాసేపు ఆగండి. వెంటనే ఆ సమస్య వైపు పరిగెత్తకుండా కాసేపు నిశ్శబ్దంగా ఒకచోట కూర్చోండి. మీకు ఇంకా సమయం ఉంటే కొద్దిగా మంచి నీళ్లు తాగి ఆ సమస్యను పరిష్కరించుకోండి. దీనిని మీరు ప్రతి సారి ప్రయత్నం చేస్తే మీకు ఇదే అలవాటైపోతుంది.
అనవసరమైన పనులు చేయకండి:
అన్ని పనులు మీ నెత్తిన పెట్టుకుంటే మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. దీని వల్ల మీరు మీ సహాయాన్ని కోల్పోతారు. కాబట్టి మీరు కరెక్ట్ గా మీ టైం షెడ్యూల్ చేసుకోండి. అలానే ముఖ్యమైన వాటి మీదే దృష్టి పెట్టి ఆ పనులు చేయండి. అంతే కానీ గజిబిజిగా మీరు అన్ని పనులు మీరు నెత్తిన పెట్టుకుని ఇబ్బంది పడకండి.
రిలాక్స్ గా ఉండండి:
మీరు నెమ్మదిగా ఉండి ఫుల్ గా ఊపిరి పీల్చుకుంటూ మైండ్ రిలాక్స్ చేసుకోండి. ఒత్తిడిని మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా మీ పనిని మీరు డీల్ చేయండి. వీలైతే ప్రతి రోజు మీరు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. దీని వల్ల మీరు ప్రశాంతంగా ఉండటానికి వీలవుతుంది.