న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ప్రమాణ స్వీకారం

-

న్యూజిలాండ్‌ నూతన ప్రధానిగా క్రిస్‌ హిప్‌ కిన్స్‌(44) ప్రమాణ స్వీకారం చేశారు. గత వారం జెసిండా ఆర్డెర్న్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసి అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో క్రిస్‌ న్యూజిల్యాండ్‌ 41వ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. కొద్దిమంది స్నేహితులు, సహోద్యోగుల సమక్షంలో హిప్‌కిన్స్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

న్యూజిల్యాండ్‌లో కొవిడ్‌ మహమ్మరి ప్రతిస్పందన రూపుశిల్పిగా పేరుపొందిన క్రిస్‌ అక్టోబర్‌లో జగరబోయే సాధారణ ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగనున్నారు. కొంతకాలంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని హిప్ కిన్స్ హామీ ఇచ్చారు.

జెసిండా స్థానంలో పోటీలో క్రిస్ ఒక్కరే ఉండటం వల్ల లేబర్ పార్టీలో సభ్యుల ఆమోదం లాంఛనమైంది. ప్రధాని స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవటం వల్ల చట్ట సభ్యులు హిప్కిన్స్ వైపే మొగ్గుచూపారు. కరోనా వైరస్ ఉద్ధతంగా ఉన్న సమయంలో క్రిస్ సమర్థంగా బాధ్యతలు నిర్వహించడంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version