నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు

-

Waqf Bill to be tabled in Rajya Sabha today: రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు రానుంది. వక్ఫ్ సవరణ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో ఎన్డీయేకు 125 మంది సభ్యుల బలం ఉండడంతో పాస్ అవ్వడం లాంఛనమే. కాగా, 12 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

అయితే, ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు… లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు పడ్డాయి. అలాగే వ్యతిరేకంగా 232 ఓట్లు పడడం జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగింది. అనంతరం ఈ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది.. అర్ధరాత్రి 12 గంటలకు దాటినా కూడా… ఈ సవరణ బిల్లు పైన చర్చ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ కూడా నిర్వహించారు. ఈ తరుణంలోనే లోక్సభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news