మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. నేడు హైకోర్టులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగనుంది. పొదలకూరు పోలిస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి.

తాటిపర్తిలో రూ. 250 కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని మూడోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.