వార్ ఎఫెక్ట్ : త్వ‌ర‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 200..!

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక చ‌ర్య చెప‌ట్టిన విషయం తెలిసిందే. కాగ యుద్ధం ప్రారంభం అయి.. రోజులు గ‌డుస్తున్న రెండు దేశాలు కూడా త‌గ్గ‌డం లేదు. యుద్ధాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ యుద్ధ ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై ప‌డ‌తుంది. ఈ రెండు దేశాల నుంచి బంగారం, వెండి తో పాటు చ‌మురు ఉత్ప‌త్తులు కూడా చాలా దేశాలు దిగుమ‌తి చేసుకుంటున్నాయి. అయితే యుద్ధం వల్ల ఈ రెండు దేశాలకు సంబంధించి ఎగుమ‌తులు – దిగుమ‌తులు స్తంబించి పోయాయి.

దీంతో ప్రపంచ వ్యాప్తం గా కొన్ని వ‌స్తువుల కొరత ఏర్పాడింది. అందులో పెట్రోల్, డీజిల్ ముఖ్య‌మైన‌వి. అయితే మ‌న దేశం కూడా కొంత వ‌ర‌కు చమురు ఉత్ప‌త్తుల‌ను ఉక్రెయిన్ దేశం నుంచి దిగుమ‌తి చేసుకుంటుంది.అయితే ఇప్పుడు దిగుమ‌తులు ఆగిపోవ‌డంతో.. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లకు రెక్క‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బ‌ల్క్ డీజిల్ ధ‌ర రూ. 103 పైకి చేరింది. అలాగే కొద్ది రోజుల్లోనే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 200 కు చేర‌డం ఖాయం అని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత భారీగానే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version