హెచ్చరిక.. జూన్ 21న ప్రపంచం అంతం అంటున్న కుట్ర సిద్ధాంతకర్తలు.. ??

-

 

అసలే కరోనాతో ప్రజలంతా కాకుల్లా అల్లాడుతుంటే, హర్ట్ ఎటాక్ తెచ్చే మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమే అంతం కాబోతుందంటూ బాంబ్ పేల్చారు కుట్ర సిద్ధాంతకర్తలు.. మాయన్ క్యాలెండర్ తప్పుంటూనే, ఈ సంవత్సరం జూన్ 21న ప్రపంచం అంతం తప్పదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచం వచ్చే వారం ముగుస్తుందని వీరి అభిప్రాయం. ఇకపోతే 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినప్పుడు.. సూర్యుడిని కక్ష్యలోకి తీసుకోవడానికి భూమి తీసుకునే సమయాన్ని ప్రతిబింబించేలా ఏడాది నుంచి 11 రోజులు కోల్పోయిందనే వాస్తవం ఆధారంగా ఈ వింత సిద్ధాంతం పుట్టుకొచ్చిందట.

కాగా కొంతమంది కుట్ర సిద్ధాంతకర్తలు డిసెంబర్ 21, 2012 లో ప్రపంచం అంతం ఉండాలని పేర్కొన్నారు కానీ అది జరగలేదు.. తాజాగా ఈనెల 21న అని మరోసారి వారు తెరపైకి వచ్చారు.. ఇక నాసా లెక్కల ప్రకారం చూస్తే.. సుమేరియన్లు కనిపెట్టిన నిబిరు గ్రహం భూమి వైపు వెళుతుందనే వాదనలతో అసలు కథ ప్రారంభమైంది. ఈ విపత్తు మొదట్లో మే 2003లో ఉంటుందని అంచనా వేశారు. కానీ, అప్పుడు ఏమీ జరుగలేదు. ఆ తర్వాత డోంసు డే, తేదీని డిసెంబర్ 2012కి ముందుకు తరలించి, అదే యుగాంతమంటూ 2012లో సంక్రాంతి సమయంలో పురాతన మాయన్ క్యాలెండర్‌లోని ఒక చక్రం ముగింపుతో అనుసంధానించారు..

 

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచం డిసెంబర్ 21, 2012తో ముగియలేదు. ఇకపోతే సైన్స్ చెప్పే విషయం ఏంటంటే.. ఇలాంటివన్ని కల్పిత వాదనలు, పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు లేదా ఇంటర్నెట్ ద్వారా తయారు చేసినవి. అయినా వీరి వాదనలకు నమ్మదగిన ఆధారాలు లేవనే చెప్పాలి. 2012లో యుగాంతం అన్నారు.. ఏమి లేదు.. ఇప్పుడు 2020 జూన్ 21న ప్రపంచం అంతం అవుతుందనడంలో వాస్తవం లేదన్నట్టే అని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.. అసలు ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు గానీ ఈ గాలి వార్తలతో జనం ఇప్పుడే చచ్చేలా ఉన్నారని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version