ఎంతకష్టం: చంద్రబాబుకు మరో చేదు అనుభవం!

-

కరోనా సమయంలో రాష్ట్రప్రభుత్వం అనుమతి కోరితే తనస్థాయి తగ్గిపోద్దని భావించారో లేక మోడీ భజనలో భాగంగా చేశారో తెలియదు కానీ.. జగన్ ని కాదని మోడీని రిక్వస్ట్ చేసుకున్నారు బాబు. అనుమతి అడగడానికి ఫోన్ ఎత్తిన వారు.. అనుమతి ఇవ్వడానికి మాత్రం ఫోన్ ఎత్తలేదు!! ఫలితంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ సమయంలో బాధితులను పరామర్శించే విషయంలో బాబుకు చేదు అనుభవమే ఎదురైంది. అయినా కూడా బాబు తగ్గలేదు.. విశాఖ బాదితులను పరామర్శించలేదు. జగన్ ని అనుమతి అడగడం కంటే… విశాఖ ప్రజలను పట్టించుకోకపోవడమే బెటరనుకున్నట్లుగా ఉండిపోయారు! మళ్లీ సేం సీన్ రిపీటయ్యింది!!

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి అనారోగ్యం కారణంగా గుంటూరు ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారులను రిక్వస్ట్ చేసుకున్నారు. కానీ ఈ మాజీముఖ్యమంత్రి అభ్యర్ధనను అధికారులు తిరస్కరించారు. అవును… గుంటూరులో అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని చంద్రబాబుకు జైళ్ల శాఖ తేల్చిచెప్పింది. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని.. కాబట్టి మీకు కూడా ఇవ్వలేమని క్లారిటీగా చెప్పింది.

అయితే… తాము ఇవ్వలేకపోయినా మరో ఆప్షన్ ఉందన్నట్లు సూచన చేసిన జైళ్లశాఖ అధికారులు… జిజిహెచ్ హాస్పటల్ సూపరింటెండెంట్ ను సంప్రదించమన్నారు. బాబు అక్కడ ప్రయత్నించినా.. అక్కడనుంచి కూడా అనుమతి రాలేదు సరికదా… మరో సూచన వచ్చింది. ఈ మేరకు మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొని రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మూఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మరి అక్కడ కూడా అనుమతి దొరుకుతుందో లేదో చూడాలి! చంద్రబాబు లాంటి స్థాయి మనిషికి ఇలాంటి పరిస్థితి రావడంపై తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! ఎంతకష్టం… చంద్రబాబుకు మరో చేదు అనుభవం అని ఫీలవుతున్నారు!! మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడికి అనుమతి ఎందుకు ఇవ్వడంలేదని ఆన్ లైన్ లో కోప్పడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version