షవర్మా ప్రియులకు హెచ్చరిక..తస్మాత్ జాగ్రత్త..

-

షవర్మా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. బాయిల్ చికెన్ తో తయారు చెస్తున్నారు. అంతే కాదు కొన్ని రకాల ఫ్లేవర్స్ ను కలపడం వల్ల అదిరిపోయే టెస్ట్ ఉంటుంది. అందుకే జనాలు వీటిని తినడానికి ఎగబడుతున్నారు.. అయితే మీ ప్రాణాల మీదకు వచ్చినట్లే..డబ్బులు ఇచ్చి మరి జబ్బులను కొని తెచ్చుకోవడం అంటున్నారు ఆహార నిపుణులు..అసలు షవర్మా వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చుద్దాము..

 

అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసిన షవర్మా తింటే మంచిదే. కాని కుళ్లిన, పాడైన షవర్మా తింటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు డాక్టర్లు. కొత్త కొత్త జంక్‌ఫుడ్స్‌ ఇప్పుడు మార్కెట్లో కనబడుతున్నాయి. ఆకర్షణీయమైన పేర్లతో కనబడే వంటకాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కేరళలో చికెన్‌తో తయారు చేసిన షవర్మా తిని దేవానంద అనే స్టూడెంట్‌ చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హైదరాబాద్‌లో గల్లీగల్లీలో షవార్మా సెంటర్లు కనబడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికి కేరళలో జరిగిన ఘటన హైదరాబాద్‌లో కూడా జరిగే ప్రమాదముంది..చాలా మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే..

ఈ షవర్మా విషయం పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..కుళ్లిపోయిన, పాడైన చికెన్‌తో షవర్మా చేస్తున్న దుకాణాలపై పలు చోట్ల దాడులు నిర్వహించారు. చెన్నై, తిరువళ్ళూరు, కోయంబత్తూరులో తమిళనాడు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. నిజానికి షవర్మాను చాలాసార్లు వేడి చేస్తుంటారు. పదే పదే వేడి చేయడం వల్ల షవర్మా పాడవుతుందా? ఈ విషయంపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.. షిగెల్లాతో పాటు సర్మోనెల్లా అనే బ్యాక్టీరియాలు ఆ షవర్మాలో బయటపడ్డాయి. ఈ బ్యాక్టిరియా కారణంగా డయేరియాతో పాటు జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని డాక్టర్లు తెలిపారు..జర జాగ్రత్త మిత్రమా.. రుచిగా ఉందని టెంప్ట్ అయ్యారో.. లైఫ్ టైం కంప్లీట్ అయినట్లే.. బీ కేర్ ఫుల్..

Read more RELATED
Recommended to you

Exit mobile version