భర్తలు ఎలా ఉండాలో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది…వైరల్..

-

ఈ రోజుల్లో ప్రేమ అంటే కేవలం అవసరాలకు కేరాఫ్ మారింది..శారీరక సుఖం పొందేందుకు మాత్రమే పనికి వస్తుంది.అంతటితో ఆగడం లేదు దారుణాలకు తెర తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి ఈరోజుల్లో ఓ భర్త,తన భార్య పై చూపిస్తున్న ప్రేమ ఓ బస్టాపే సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక భార్య భర్తలకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

ఆ వీడియోలో ఓ వ్యక్తి బస్ స్టేషన్ లో బస్ కోసం ఎదురుచూస్తున్నారు.. బస్‌ రావడానికి సమయం ఉండటంతో.. అలసిపోయిన భార్య.. అలా భర్త ఒడిలో సేద తీరుతోంది. భర్త కూడా నొచ్చుకోలేదు. భార్యపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఆమెను నిద్రపుచ్చాడు. తలపై చేతితో నిమురుతూ, చంటి బిడ్డను చూసుకున్నట్లే భార్యను చూసుకుని, తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు.. ఒకవైపు అతనికి కూడా నిద్ర వస్తున్నా ఆపుకొని మరీ ఆమెను చూసుకొవడం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 57 వేల మంది వీక్షించారు. వీరి ప్రేమ గొప్పది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఒక మహిళ తన భర్త ఒడిలో తల పెట్టుకుని హాయిగా నిద్రిస్తున్నట్లు చూడొచ్చు. అతడు కూడా ఆమె తలను ఆప్యాయంగా తట్టడం, స్త్రీ నిద్రపోయే సమయంలో ఇబ్బంది పడకుండా చూసుకోవడం చూడవచ్చు.. డబ్బులు ఉన్నా ,లేకున్నా ప్రేమగా చూసుకునే భర్త మీతో ఉన్నారు అంటూ ట్యాగ్ చేశారు..మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..మీరు కూడా ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version