ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారీ వర్షాలకు తాజ్‌మహల్‌ను యమునా నది తాకింది. ఈ తరుణంలోనే… ఆగ్రాకు వరద హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్ గోడకు యమునా నది నీరు చేరుకుంది.

దీంతో వరద నియంత్రణ చర్యలు ప్రారంభించారు అధికారులు. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి పెరిగిందని తెలిపారు అధికారులు. గతంలో 2023లో సైతం నీటి మట్టం ఇదే భారీ స్థాయిలో పెరిగిందని చెబుతున్నారు చరిత్రకారులు. వరద పరిస్థితి సమీక్షించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది జిల్లా యంత్రాంగం. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాలలో…. ఉన్న ప్రజలు భయంతో భిక్కు భిక్కుమంటున్నారు.
Agra, Uttar Pradesh: The Yamuna River has swelled near the Taj Mahal pic.twitter.com/I5IWU82OXZ
— IANS (@ians_india) September 4, 2025