ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి అదనపు ఫండ్స్ రానున్నాయి. ప్రస్తుతం గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో ఇప్పుడు PM ఆవాస్ యోజన కింద ప్రతి లబ్ధిదారుకు కేంద్రం రూ.72,000 ఆర్థిక సహాయం ఇస్తోంది. దీనికి తోడు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.27,000 మంజూరు చేస్తారు. అంటే లబ్ధిదారుడు జాబ్ కార్డు కలిగి ఉంటే, ఇంటి పనులు కింద 90 రోజుల పాటు రోజుకు రూ.300 చెల్లింపు రూపంలో ఈ మొత్తం అందుతుంది. అదనంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరొక రూ.12,000 టాయిలెట్ నిర్మాణానికి మంజూరు చేస్తారు.

ఈ విధంగా లబ్ధిదారుకు కేంద్రం మొత్తం రూ.1.11 లక్షల వరకు సహాయం అందిస్తుంది. అయితే ఇంటి నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ.5 లక్షలు అవుతుందని అంచనా. కాబట్టి మిగతా రూ.3.89 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ పథకంతో గ్రామీణ పేద కుటుంబాలు పటిష్టమైన ఇళ్లను కట్టుకునే అవకాశం లభిస్తోంది. లబ్ధిదారులు కేవలం గృహానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, జాబ్ కార్డు, స్వచ్ఛ భారత్ నిబంధనలు పాటిస్తే సరిపోతుంది. కేంద్రం–రాష్ట్రం సంయుక్త సహకారంతో ఈ ఇళ్లు నిర్మాణం అవ్వడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.