ప్రమాదంలో కాకినాడ ఉంది… సుబ్బంపేట దాకా సముద్రపు నీరు వచ్చేసింది. కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కాకినాడలో రోడ్డు ధ్వంసం అయింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో ఎగసి పడుతున్నాయి కెరటాలు. అలల తాకిడికి సుబ్బంపేట పేట వద్ద ధ్వంసం అవుతోంది బీచ్ రోడ్డు.

సుబ్బంపేట ప్రాధమిక పాఠశాల వద్దకు చేరుకుంది సముద్రపు నీరు. సముద్రం పోటు మీద ఉండడంతో తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి కెరటాలు. దీంతో కాకినాడ ప్రజలు వణికిపోతున్నారు. అటు ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు పడున్నాయి. పిడుగులు పడే ప్రమాదం కూడా పొంచిఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది APSDMA. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
బ్రేకింగ్ న్యూస్
విరుచుకుపడుతున్న కెరటాలు.. రోడ్డు ధ్వంసం
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో ఎగసి పడుతున్న కెరటాలు
అలల తాకిడికి సుబ్బంపేట పేట వద్ద ధ్వంసం అవుతున్న బీచ్ రోడ్డు.
సుబ్బంపేట ప్రాధమిక పాఠశాల వద్దకు చేరుకున్న సముద్రపు నీరు
సముద్రం పోటు మీద ఉండడంతో తీరంలో అలజడి… pic.twitter.com/6cfrLjDDwM
— Telugu Feed (@Telugufeedsite) September 11, 2025