కెఫీన్ లేకుండా శక్తిని పొందాలనుకుంటున్నారా? కేవలం టీ గురించి ఆలోచిస్తున్నారా? మీరు రోజు తాగె అలవాటైనా టీ కి భిన్నంగా ఒక ఆరోగ్యకరమైన అందమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే, ఈ టీ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకర్షణీయమైన నీలిరంగులో ఉండే బ్లూ టీ క్లోటోరియా టెర్నాటియా పువ్వుల నుండి తయారవుతుంది. కెఫిన్ లేకుండా మీకు శక్తిని రుచిని అందిస్తుంది. అంతేకాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తరచుగా అలసటతో ఉన్న ఎక్కువ కాఫీ,టీ తాగడం తగ్గించాలి అనుకుంటున్నా మీకు ఒక ప్రత్యామ్నాయం దొరికినట్లే, అదే బ్లూ టీ దీనినే అపరాజిత టీ అని కూడా అంటారు. క్లిటోరియా టెర్నాటియా అనే అందమైన నీలిరంగు పువ్వుల రేకులను ఎండబెట్టి తయారు చేసే ఈ టీ లో కెఫెన్ ఉండదు. ఈ పువ్వులు శంఖం ఆకారంలో ఉంటాయి. ఇది మీకు శక్తిని అందించడమే కాక ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా సహాయపడుతుంది.
బ్యూ టీ యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఆంథోసయనిన్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది చర్మం మరియు జుట్టుకు చాలా మంచిది. బ్లూ టీ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గి, చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా బ్లూ టీ చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు బ్లూ టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఇది మరసటి రోజు ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి బ్లూ టీ ఒక అద్భుతమైన పానీయం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ టీ బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక ఎందుకంటే ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సాధారణంగా టీ కి ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బ్లూ టీని పరిచయం చేయవచ్చు. మీరు వేడి వేడిగా లేదా చల్లగా కూడా దీని తాగవచ్చు. కొద్దిగా నిమ్మరసం కలిపితే ఈ టీ రంగు నీలిరంగు నుండి ఊదా రంగులోకి మారడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన పానీయం రోజువారి అలవాటులో భాగమైతే శక్తివంతమైన జీవితం మీ సొంతం అవుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే,ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ ను సంప్రదించండి.