గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు..కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంగా పద్దులను ఆయన చదవి వినిపించారు.

ఈ క్రమంలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పెన్షన్ల పెంపు లాంటి పలు పథకాలు అన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. కాగా, బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. ఈసారి రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు.