చంద్రమండలానికి వెళ్తున్నాం.. కానీ భూమిపై ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఐఐ ప్రతినిధుల ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కాలుష్యకారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నాం.తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించాం.మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించు కునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు ను పెంచాం. మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాం. మచిలీపట్నం పోర్ట్ ను అనుసంధానం చేస్తు రోడ్డు, రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రధాని మోదీ ని కోరామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.