2047 నాటికి రియల్ ఎస్టేట్ రంగం 20 శాతం పెరుగుతుంది : సీఎం చంద్రబాబు

-

2047 నాటికి రియల్ ఎస్టేట్ రంగం 20 శాతం పెరుగుతుందని  సీఎం చంద్రబాబు  నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన గుంటూరు లో నరేడ్కో ప్రాపర్టీ షోని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. పడకేసిన నిర్మాణ రంగానికి మళ్లీ ఊతమిస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది. రాష్ట్ర జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం 7.3 శాతంగా ఉంది.. 2047 నాటికి 20 శాతం పెరుగుతుందని అంచెనా వేస్తున్నట్టు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అన్నీ కుదేలయ్యాయి. చెడు పనులు చేయాలంటే చాలా సులువు.. మంచి పని చేయాలంటే చాలా కష్టం అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తానంటే చాలా సమస్యలు వచ్చాయి. ఉచిత ఇసుక ఇస్తానన్నాం.. అక్కడక్కడ స్వార్థపరులు వస్తున్నారు. డ్రోన్ల ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగం పై 34 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, తాము వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత కల్పించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version