దాయాది పాకిస్తాన్ నిన్న రాత్రి ఇండియా మీద మిసైల్ అటాక్స్ చేసిన విషయం తెలిసిందే. భారత్ లోని సుమారు 15 నగరాలను పాక్ తన టార్గెట్‌గా ఎంచుకుని దాడులకు పాల్పడింది. ఆ సమయంలో ఇండియాలోని పంజాబ్ , రాజస్తాన్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు.
అయితే, పాక్ మిసైల్ దాడుల గురించి రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మేర్ వాసులు జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘పాక్ బాంబులు వేసింది అనుకోలేదని, పటాకుల శబ్దం అనుకున్నాం. నిన్న రాత్రి 9 గంటల సమయంలో బ్లాకౌట్ తర్వాత పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పటాకుల శబ్దాలు అనుకున్నాం..కానీ, పాకిస్తాన్ డ్రోన్ బాంబులని తెలిశాక భయాందోళన చెందాం. అయితే, పాక్ డ్రోన్లను భారత్ సమర్థంగా ఎదుర్కొంది. మేమంతా సురక్షితంగానే ఉన్నాము’ అని జైసల్మేర్ నివాసి వెల్లడించారు.