మహిళ అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని మంత్రి సీతక్క అన్నారు.ఈ క్రమంలోనే మహిళలందరూ ఒకే కుటుంబాన్ని తలపించేలా చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీపై ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇందులో 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా చీరలు అని, ప్రతీ మహిళకు రెండెసి చీరల చొప్పున పంపిణీకి సర్కారు నిర్ణయించిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు తొలిసారి చీరల పింపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు మహిళలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వివరించారు.అంతేగాక వన్ కార్పొరేట్ వన్ విలేజ్ అడాప్షన్ గొప్ప నిర్ణయమని,కార్పొరేట్ పల్లె ప్రాంతాల అభివృద్దికి పని చేయాలని, కార్పొరేట్లకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న నిర్మాణ్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఇక దీనిపై ప్రజాప్రభుత్వం హయాంలో మొదటి ఏడాదిలోనే మహిళల కేంద్రంగా ఎన్నో సంస్కరణలు చేశామని తెలిపారు.