Veteran BJP leader Lal Krishna Advani : BJP అగ్రనేత, కురువృద్ధుడు LK అద్వానీ అభిమానులకు ఊహించిన షాక్ తగిలింది. BJP అగ్రనేత, కురువృద్ధుడు LK అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మరోసారి శనివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో BJP అగ్రనేత, కురువృద్ధుడు LK అద్వానీ చేర్పించారట. పార్టీ సీనియర్ నేతను మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎల్‌కే అద్వానీ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. అద్వానీ అవిభక్త భారత్ లోని కరాచీలో జన్మించారు. సుదీర్ఘకాలం పాటు BJPలో పని చేసిన రాజకీయ కురువృద్ధుడిగా ఆయన పేరుగాంచారు.