మాకు బియర్డ్ లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి.. గర్ల్స్ ర్యాలీ వైరల్

-

మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిల అభిరుచుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మొన్నటివరకు మాకు గడ్డం ఉండే అబ్బాయిలు కావాలన్న అమ్మాయిలు ఇప్పుడు క్లీన్ షేవ్ ఉండే వారే బాయ్ ఫ్రెండ్స్‌గా కావాలని కోరుతున్నారు.తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ అమ్మాయిల బృందం తమకు గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ వీధుల్లో ర్యాలీ తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పెట్టుడు గడ్డం ధరించిన కొందరు అమ్మాయిలు ఇండోర్ వీధుల్లో బాయ్స్ గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.‘నో క్లీన్ షేవ్..నో లవ్’ అంటూ నిరసన తెలిపారు. గడ్డం వదులుకోండి.. లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను వదులుకోండి అంటూ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు స్లోగన్ రాసుకుని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా వీక్షించగా.. 4.4 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version