మేమూ యూసీసీ తీసుకొస్తాం: రాజస్థాన్ మంత్రి

-

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈరోజు యూసీసీ బిల్లుకు ఆమోదం లభించింది . ఈ నేపథ్యంలో రాజస్థాన్ కూడా ఆ బిల్లును తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కన్హయ్య లాల్ చౌదరి ప్రకటించారు. ‘ప్రస్తుత లేదా వచ్చే అసెంబ్లీ సెషన్లో యూసీసీ బిల్లును ప్రవేశపెడతాం అని అన్నారు.

ఈ బిల్లు విషయంలో ముందడుగు వేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ధన్యవాదాలు తెలిపారు. ముందు ఈ బిల్లును ఆయన ప్రారంభించారు అని గుర్తు చేశారు.ఇక దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుండగా తర్వాతి రాష్ట్రం రాజస్థాన్ అవుతుంది’ అని పేర్కొన్నారు.వారసత్వం, దత్తత,పెళ్లి, విడాకులు వంటి అంశాల్లో అన్ని మతాలకు ఒకే విధమైన చట్టం తీసుకురావడమే ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌ ప్రధాన ఉద్దేశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version