రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్ని వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేఖ గారు శాసనసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్టు ఆమె స్పష్టీకరణ చేశారు.
కాగా, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా శాసనసభ్యులు మదన్మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సురేఖ గారు సమాధానం చెప్పారు.ఇదే విషయంపై ఆయన తనకు ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా అందజేశారని సభలో వెల్లడించారు. కాగా, దేవాలయాల్లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని.. డబ్బుల సంపాదనే మినహా ఎవరూ రూల్స్ పాటించడం, ఆలయాల్లో వసతులు, పరిశుభ్రత కరువైందని పెద్దఎత్తున విమర్శలు తలెత్తాయి.