జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రొద్దుటూరు, వెంకటగిరి, కంబదూరు, తిరుపతి రూరల్ వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశంలో భాగంగా వైఎస్ జగన్ మౌనం పాటించి నివాళులర్పించారు.
ఆయనతో పాటు వైసీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు సైతం సంతాపం తెలిపారు. ఇదిలాఉండగా, ఏపీకి చెందిన ముగ్గురు నుంచి నలుగురు సాధారణ పౌరులు పహెల్గంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది సీఎం చంద్రబాబు ప్రకటించారు. మృతులకు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.