త్వరలోనే కాళేశ్వరం వాస్తవాలు బయటపెడతాం : మంత్రి కోమటిరెడ్డి

-

త్వరలోనే కాళేశ్వరం వాస్తవాలు బయటపెడతామని, దాని కథేంటో అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.శనివారం భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం నుంచి వచ్చిన NDSA రిపోర్టులో సంచలన విషయాలున్నాయన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ నాసిరకమైన ప్రాజెక్ట్ అని.. తెలివి ఉన్న వాడు ఎవడూ ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించి ఉండేవారు కాదన్నారు.

NDSA రిపోర్టులోని అంశాలను తాము ఇంకా బయట పెట్టలేదని.. బీఆర్ఎస్ వాళ్లే బయటకు పెట్టుకుంటున్నారని విమర్శించారు.ఒక వేళ తమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందోనని..పదేళ్ల పాటు ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోకుండా పడావు పెట్టారన్నారు.మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్‌లు ఎందుకూ పనికి రావని NDSA నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news