భారత్ సమ్మిట్.. ప్రత్యేక ఆకర్షణగా సామాజిక న్యాయ ఎగ్జిబిషన్ స్టాల్

-

హైదరాబాద్ హెచ్ఐసీసీ నొవాటెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతున్నది.పెట్టుబడులు,న్యాయం,అహింస,ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజర్యయ్యారు.

ఈ సందర్భంగా శనివారం భారత్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ ఎగ్జిబిషన్‌ స్టాల్‌ను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రతినిధులు విశ్వనాథన్,మంత్రులు సీతక్క కొండా సురేఖ, ఎంపీలు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, భారత్ సమ్మిట్‌లో నేడు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news