గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ కుంట్లూరు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్‌లో ఉన్న గుడిసెల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో గుడిసెలకు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది వెంటనే మంటలు అదుపులోకి తెచ్చేందుకు నాలుగు 4 ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 30 గుడిసెలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. గుడిసెలో ఉన్న సిలిండర్లు ఎక్కడ పేలుతాయో అని స్థానికులు, పేదప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రావినారాయణ రెడ్డి నగర్లో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.