నటుడు కాదంబరి కిరణ్ ఇంట పెళ్లి సంబరాలు..!

-

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే.. సెలబ్రిటీల వారసులు కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాదంబరి కిరణ్.. తన చిన్న కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించినట్టు తెలుస్తోంది. తెలుగులో పలు సినిమాలలో సహాయక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన అందరి స్టార్ హీరోలతో కలిసి నటించారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా మిగిలిన విభాగాలపరంగా కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అలా “మనం సైతం” పేరుతో పలువురికి సహాయం కూడా అందించారు.

చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయనకు వారసులు లేకపోవడం గమనార్హం. ఈయనకు ఉన్నిందల్లా ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఇద్దరికీ కూడా ఇప్పుడు చాలా ఘనంగా వివాహం జరిపించారు. అసలు విషయంలోకి వెళితే.. 2021 డిసెంబర్ లో పెద్దమ్మాయికి పెళ్లి చేసిన కాదంబరి కిరణ్.. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లిని కూడా హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.

ఈ పెళ్లికి తలసాని శ్రీనివాస్ యాదవ్, జెడి లక్ష్మీనారాయణ, కోటా శ్రీనివాసరావు, ఆలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక కాదంబరి కిరణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చి.. నటుడు గానే కాకుండా రైటర్ , డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నటుడిగా రంగస్థలం , శ్రీమంతుడు , భరత్ అనే నేను సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version