పండ్ల తోటలో కలుపు నివారణ చర్యలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

ఎటువంటి పంట వేసిన కలుపు నివారణ అనేది ముఖ్యం.. ఎందుకంటే పంటలకు వేస్తున్న బలాన్ని అవి తీసుకుంటాయి.దాంతో పంట దెబ్బ తింటుంది.తోటలో కలుపు విస్తారంగా పెరుగుతుంది. ఎందువల్ల అనగా ఎక్కువసార్లు అంతరకృషి చేయరు సాధారణంగా పైర్లలో కలుపు మొక్కల నిర్మూలన రసాయనాల వాడటం కంటే ఎక్కువగా వుంచి ఫలితాలతో కలుపు మొక్కల నిర్మూలను రసాయనాలను ఉపయోగించవచ్చు. ఎందువల్లనంటే, తోటలలో ఉన్న చెట్లు పెద్దవిగాను, కలుపు మొక్కలు చిన్నవిగా ఉండటం వల్ల వీటి తారతమ్యాలను ఉపయోగించుకుని పైరుల కంటే ఎక్కువ మోతాదులో కలుపు మొక్కల రసాయనాలను కలుపు నిర్మూలించుటకు వాడటానికి అవకాశం ఉంది…

 

ఇప్పుడు ఎక్కడ చూసిన విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..వర్షాకాలంలో దున్నడం వల్ల కలుపు మొక్కలు పోతాయి..నేల గుళ్లబారుతుంది..నీళ్ళు కూడా నిలబడవు..తొలకరి వర్షం తరువాత అట్రటాఫ్ ఎకరాకు 800గ్రా. 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి/తుంగజాతి కలుపు నివారణకు డైసెల్ లేదా రౌండప్ కలుపు మందును లీటరు నీటికి 8 మి.లీ మందును కలిపి దానితోపాటు 20 గ్రా అమ్మోనియం సల్ఫేట్గాగాని, 10గ్రా. యూరియా గాని కలిపి 20-25 రోజులు కలుపై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటపుడు చిన్న వయసు పండ్ల మొక్కల పైపడకుండా జాగ్రత్త వహించాలి. మామిడి, చీనీ, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం తోటలలో పై విధంగా కలుపును నివారించుకోవచ్చు..

ఇక అరటి మొక్కలలొ కలుపును కూలీలతో 15-20 రోజులకొకసారి తీయిస్తే ఖర్చు పెరుగుతుంది. అందుచేత, అలసంద చల్లి 40-50 రోజులకు భూమిలో కలియదున్నటం వలన భూసారం వృద్ది అయి, అరటి దిగుబడి పెరుగుతుంది. కలుపు నిర్మూలన జరుగుతుంది. నాగలి లేక పవరు టిల్లర్తో దున్ని కలుపు నిర్మూలించవచ్చు. ఎకరాకు 2.లీ బుటాక్లోర్ లేదా లీ అలాక్లోర్ లేక 1 లీ పెండిమిథాలిన్ లేక 300 మి.లీ అక్సిఫ్లోర్ఫెన్ 200 లీ నీటిలో కలిపి తేమగా ఉన్న భూమిపై కలుపు మొలకెత్తటానికి ముందే పిచికారి చేయాలి. 40-50 రోజుల తర్వాత పలుచగా మొలకెత్తిన కలుపును కూలీలతో తీయిస్తే బెస్ట్..ఎప్పటికప్పుడు తీస్తూ ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుంది..ఇంకేదైనా సందెహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version