వెస్ట్ బెంగాల్ బీర్భూమ్ హింసాకాండలో మృతుల సంఖ్య 9కి చేరింది. గత వారం టీెఎంసీలో రెండు వర్గాల ఘర్షణ కారణంగా ఓ వర్గం మరో వర్గం ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది చనిపోయారు. టీఎంసీ నేత బదు షేక్ మరణానికి ప్రతీకారంగా బీర్భూమ్ హత్యాకాండ చోటు చేసుకుంది. తాజాగా నజెమా బీబీ అనే మహిళ 65 శాతం కాలిన గాయాలతో గత రాత్రి మరణించింది. రాంపూర్ హట్ లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆమె మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారివలో ఏడుగురు మహిాళలు ఉండగా.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం ఒక బాలుడితో సహా మరో ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా బీర్భుమ్ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. కలకత్తా హైకోర్ట్ ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ బీర్భూమ్ ఘటనపై విచారణ జరుపుతోంది. ఏప్రిల్ 7లోగా తుది నివేదిక కోర్ట్కు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.