RRRకు యమ క్రేజ్.. కండోమ్ కంపెనీ ప్రమోషన్స్‌లోనూ..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రికార్డు వసూళ్లు చేస్తోంది. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు. ‘రౌద్రం, రణం, రుధిరం’ థీమ్ కాన్సెప్ట్ ను రాజమౌళి ఎప్పుడో ప్రకటించగా, దానికి బదులుగా షార్ట్ కట్ అయిన RRR ను మాత్రం జనం బాగా గుర్తు పెట్టేసుకున్నారు. అలా ఈ వర్డ్ కు యమ క్రేజ్ వచ్చింది. దాంతో ఈ పేరుతో మార్కెట్ లో బోలెడంత ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి.

condome rrr

కొన్ని ప్రాంతాల్లో RRR పేరుతో రకరకాల షాపులు ఓపెనింగ్ అయ్యాయి కూడా. టిఫిన్ సెంటర్స్, సెలూన్స్ ఇతరాలు అన్నిటా మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన వాళ్లు ఆరఆర్ఆర్ పేరును తెగ వాడేసుకుంటున్నారు. ఈ పాపులర్ నేమ్ వాడటం ద్వారా తమ కంపెనీ లేదా సంస్థకు ఆటోమేటిక్ గా లాభాలు వస్తాయనేది వారి అంచనా. తాజాగా ఈ పేరును కండోమ్ ప్రకటనకు వాడేశారు.

ఇండియాలోని ఫేమస్ కండోమ్ బ్రాండ్స్ లో ఒకటైన ‘స్కోర్ కండోమ్’ కూడా RRR థీమ్ ను ఉపయోగించుకుంటున్నది. ‘ఫైర్ అండ్ ఐస్’ థీమ్ తో వచ్చిన మూవీ సక్సెస్ కాగా, అది పేరు ఇక్కడ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నది కంపెనీ. ఈ క్రమంలోనే RRRని ‘రా రెస్పాన్సిబుల్ రొమాన్స్’గా పేర్కొని ప్రచారం చేస్తుండటం గమనార్హం. డిజిటల్ గా ఈ పేరును ఉపయోగించి తమ ప్రమోషన్స్ లో ఇంకా స్ట్రాంగ్ అయ్యేందుకు కంపెనీ ప్రయత్నం చేస్తున్నది.

‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ దీనిపై ట్రేడ్ మార్క్ క్లెయిమ్ చేయలేరు. తమ పేరును బ్రాండ్స్ కు ఉపయోగించినందుకు దావాలు వేయలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఆర్ఆర్ఆర్ పేరును వివిధ కంపెనీలు, సంస్థలు ఉపయోగించడం ద్వారా తమ సినిమాకు ఇంకా పాపులారిటీ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అద్భుతమైన ఉచిత ప్రచారం కూడా జరుగుతుందని అనుకుంటున్నారట.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version