వెస్టీండీస్ క్రికెట్ టీంలో కరోనా కలకలం కలిగిస్తోంది. వరసగా ప్లేయర్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ముగ్గురు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పాకిస్థాన్ తో జరుగున్న ద్వైపాక్షిక సిరీస్ ప్రశ్నార్థకంగా మారుతోంది. మ్యాచులు మొదలవ్వడానికి ముందే వెస్టీండీస్ క్రికెట్ టీంలో కాట్రేల్, మేయర్స్, ఛేజ్ లకు కరోనా సోకింది. తాజాగా మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీవ్స్ లకు కరోనా సోకింది. వీరిలో పాటు అసిస్టెంట్ కోచ్, టీం ఫిజీషియన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా వెస్టీండీస్ క్రికెట్ లో 8 మంది కరోనా బారిన పడ్డారు.
ఇదిలా ఉంటే వెస్టీండీస్ కరోనా వ్యవహారం పాకిస్థాన్కు గుబులు పుట్టిస్తోంది. చాలా ఏళ్ల తరువాత సొంత గడ్డపై క్రిెకెట్ ఆడుతుంది పాకిస్థాన్. శ్రీలంక టీంపై ఉగ్రవాదుల కాల్పుల అనంతరం ఏ విదేశీ జట్టు కూడా పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు సాహసించలేదు. తాజాగా వెస్టీండీస్ మొదటిసారిగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఇప్పుడు వెస్టీండీస్ క్రికెట్ ప్లేయర్లు వరసగా కరోనా బారిన పడుతుంటే సిరీస్ కొనసాగుతుందా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.