కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. 284/8 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ 7.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఇక ఓవర్‌నైట్ బ్యాట్స్ మన్‌గా బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్(23), మార్క్ ఉడ్(2)లను విండీస్ బౌలర్ షెనన్ గాబ్రియెల్ ఒకే తరహాలో కీపర్‌గా క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో అతను తన కెరీర్‌లో ఆరోసారి 5 వికెట్ల హాల్‌ను అందుకున్నాడు.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 204 రన్స్ కే ఆలౌటవ్వగా, విండీస్ 318 పరుగులు చేసింది. కాగా విండీస్ బౌలర్ షెనన్ తన కెరీర్‌లో ఆరోసారి 5 వికెట్ల హాల్‌ను అందుకున్నాడు. 2000 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వెస్టిండీస్ జట్టు ఓ టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం ఇదే రెండోసారి. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో.. గురువారం నుంచి మాంచెస్టర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.