ఫ్యాషన్….ఈ పదానికి అర్ధం పూర్తిగా పోయింది అని చెప్పాలి…ఎందుకంటే ఫ్యాషన్ అనేది వేసుకున్న వారికి సౌకర్యం గానే కాక చూసే వారికి వేసుకున్న వారి లో హుందా తనంగా, అందం గా కనిపించాలి.. ఫ్యాషన్ అనగానే ముందు గుర్తువచ్చేది ఆడవాళ్లే.. వారి వస్త్రదారణే… ఎందుకంటే మగవారు ధరించే దుస్తుల్లో అన్ని ప్రాంతాలలోనూ ఇంచు మించు గా ఫాంట్, షర్ట్, పంచే, నిక్కర్ ఇంతకు మించి ఉండవు…
కానీ ఆడవాళ్ళకు అలా కాదు ప్రాంతానికో సంస్కృతి, ప్రాంతానికో వైవిధ్యం కట్టుకునే దుస్తుల పట్ల, ఇవే కాక ఆధునికత పేరుతో రకరకాల పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన ఫ్యాషన్ మనకు అందుబాటులో ఉంది… ఏ సంస్కృతి అయిన కావచ్చు,ఏ సాంప్రదాయం అయిన అవ్వచ్చు మనం ధరించే దుస్తులు మనకు గౌరవాన్ని తెచ్చేలా ఉండాలి… ఎందుకంటే మనం వేసుకునే దుస్తుల్లో మన మనోభావాలు ప్రకటితమవుతాయి…
అవును ఇది నూటికి నూరుశాతం నిజం ఎవరు అవునన్నా కాదన్నా…ఫ్యాషన్ గా ఉండటం తప్పు కాదు..ఆ ఫ్యాషన్ లో వెకిలి తనం కనిపించేది గా ఉండటం తప్పు… ఈవాల్టి రోజుల్లో దుస్తులపై రకరకాల రాతలు చూస్తున్నాం…మరి అవి ఎలా ఉంటున్నాయి…మనల్ని చూడగానే మనం వేసుకున్న బట్టలమీద రాతలు కనిపిస్తాయి వాటిని అవతలివారు చదువుతారు కదా..! Kiss me….hug me… ఇలా కొన్ని చెప్పలేని స్థితిలో ఉంటున్నాయి…ఎందుకు ఇలాంటి రాతలు…వీటిని చూసి ఎవరైనా ఏదైనా అంటే తప్పు పట్టే మనం వాటిని వేసుకుని అవతలి వారికి అనే అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాం…ఫ్యాషన్ గా ఉండండి…ఆ ఫ్యాషన్ లో మిమ్మల్ని మీరు కోల్పోకుండా చూస్కోండి…