రాత్రి జైల్లో ఏం జరిగింది…? దోషి తల్లి తన కొడుక్కి ఏం ఆహారం పెట్టమని కోరిందంటే…!

-

నిర్భయ అత్యాచార దోషులను తీహార్ జైలు అధికారులు ఉరి తీసారు. వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్ ని తలారి పవన్ జలాద్ ఉరి తీసాడు. నలుగురు నిందితులకు వైద్య పరిక్షలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తర్వాత వారికి ఉరి శిక్ష అమలు చేసారు. ఉదయం 5;30 నిమిషాలకు ఈ శిక్షను అమలు చేసారు. పూర్తి స్థాయిలో తీహార్ జైలు వద్ద భద్రతను ఏర్పాటు చేసారు.

ఇక ఉరి తీసే ముందు వారిని చివరి కోరిక ఏంటీ అని అధికారులు కోరగా వాళ్ళు ఏ కోరికలు చెప్పలేదు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి పూరీ, సబ్జి, కచోరీ తినిపించాలని ఉందని జైలు అధికారులను కోరగా అందుకు అధికారులు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన దోషులకు కూడా గత రాత్రి మంచి భోజనం ఏర్పాటు చేసారు. వాళ్ళు అడిగిన ఆహారం తెప్పించారు.

అయితే వారు ఆ ఆహారాన్ని మనస్పూర్తిగా తినలేదని సమాచారం. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసారు. రాత్రి ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష అమలును అడ్డుకునేందుకు… అంగీకరించకపోవడంతో… దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్, అర్థరాత్రి దాటిన తర్వాత… సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ శిక్షను ఆపలేదు. గంట పాటు వాదనల అనంతరం సరైన కారణం లేకపోవడంతో శిక్ష అమలును నిలుపుదల చేయలేమని శుక్రవారం వేకువజామున 2.30 గం.లకు సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇక ఉరి శిక్ష ఖాయమని తెలియడంతో నలుగురు నిందితులకు రాత్రి అంతా నిద్ర లేదు. తమ సెల్ లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించారని అధికారులు పేర్కొన్నారు. జైలు నిబంధనల మేరకు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంటున్న నలుగురు నిందితులను… ఉదయం 3;30 నిమిషాలకు అధికారులు నిద్ర లేపారు. వెంటనే వైద్య పరిక్షలు నిర్వహించి నలుగురూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణకు వచ్చాక 5 గంటలకు ఉరి తీసే ప్రాంతానికి తీసుకువెళ్ళి, 5;30 నిమిషాలకు శిక్ష అమలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version