రాజమౌళికే వార్నింగ్ ఇచ్చిన నెటిజన్.. ఏమైందంటే..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా రాజమౌళి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయారు. సీరియల్ ఎపిసోడ్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. నేడు ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా చలామణి అవుతూ ఉండడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి పై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండగా.. ఒక నెటిజన్ మాత్రం ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి రాజమౌళికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అసలు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అనే విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని భాషల్లో విడుదలై మంచి ప్రేక్షకు ఆదరణ సంపాదించింది. విదేశాలలో ఉన్న దర్శక రచయితలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లలో కూడా భారీ ఆదరణ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైన విషయం తెలిసిందే.. ఈ సినిమా హిందీ వర్షన్ పై ఒక నెటిజన్ స్పందిస్తూ రాజమౌళికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేశాడు.

ఈ సందర్భంగా సదరు నేటిజన్ స్పందిస్తూ..” ఏరా జక్కన్న.. హిందీ వర్షన్ లో కూడా కొన్ని సన్నివేశాలలో అన్నా అని పెట్టడం అంత అవసరమా? ఈ సినిమా చూసిన తర్వాత మా ఫ్లోర్ లో ఉండే ఒక నేపాల్ అమ్మాయికి ఆ పదం చాలా బాగా నచ్చడంతో ఏకంగా నన్ను అన్నా అని పిలుస్తోంది” అంటూ రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ ఈ కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version