LIC: జీవిత బీమా తీసుకుంటున్నారా..? అయితే తప్పనిసరిగా ఇవి చూడాల్సిందే..!

-

చాలా మంది భవిష్యత్తు లో ఏ బాధ ఉండకూడదని.. వారి భద్రత కోసం జీవిత బీమా పాలసీలను తీసుకుంటూ వుంటారు. ఆదాయం, వయసు, భవిష్యత్తు గురించి చూసుకుని మనం కవరేజీని ఎంచుకోవాలి. అలానే ప్రీమియం చెల్లించడానికి భారం కాకుండా వుండే విధంగా చూడాలి. మీరు జీవిత బీమా తీసుకుంటున్నారా..? అయితే పక్కా వీటిని చూడాలి.

ఎప్పుడు కూడా మీ స్తొమత చూసుకోవాలి. స్థోమతకు మించి ప్రీమియాన్ని సెలెక్ట్ చెయ్యద్దు. ఇలా చేస్తే ఇబ్బంది పడాలి.
కవరేజీ, కాలపరిమితి ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని కౌంట్ చేస్తారు.
బీమా తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి బీమా కవరేజీని ఇస్తారు చూసుకోండి.
జీవిత బీమా అనేది బీమా సంస్థ, పాలసీదారుడి మధ్య ఒప్పందం.
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను తప్పనిసరిగా పాలసీ తీసుకునేటప్పుడు చెప్పాల్సి వుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే పక్కా చెప్పాలి.
వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, వయస్సు బట్టీ పాలసీ ఉంటుంది.
జీవిత బీమా పాలసీ యొక్క కాల పరిమితిని సెలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
అలానే ఏ అవసరాల కోసం పాలసీ ని తీసుకుంటున్నామో స్పష్టత ఉండాలి చుడండి.
పాలసీ కవరేజ్ ఎంత అనేదానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
అదనపు ప్రయెజనాలను కూడా మీరు చూసుకోండి.
షరతులను తప్పనిసరిగా చదివాకే మీరు పాలసీ ని తీసుకోవాలి.
చిన్న వయస్సులో ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి. అప్పుడే ప్రీమియంలు తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version