బస్సు ఆపలేదని 10 కిలో మీటర్లు చేజ్ చేసిన మహిళ.. ఏమైందంటే?

-

బస్సు ఆపలేదని ఓ మహిళ ఏకంగా 10 కిలో మీటర్లు దానిని వెంబడించింది. బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారని.. చేజ్ చేసి మరీ బస్సు డ్రైవర్,కండక్టర్‌తో సదరు మహిళ వాగ్వాదానికి దిగింది. ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్దఈ ఘటన చోటుచేసుకున్నది .

తాను ప్రతి రోజు ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు ఎక్కుతానని ఎప్పటిలాగే శుక్రవారం కూడా తనతో పాటు తన పిల్లతో కలిసి బస్సు ఎక్కేందుకు వచ్చానని ఆమె ఆరోపించింది. దిగేవాళ్లు దిగుతుండగానే కొందరు బస్సు ఎక్కారని, తాను కూడా బస్సు ఎక్కాను. తన పిల్లలు ఎక్కుతుండగా బస్సు వెళ్లిపోయిందని ఆరోపించారు. తన పిల్లలు ఎక్కలేదని చెప్పినా ఆపకుండా బస్సు కదిలిందని దాంతో నేను తన పిల్లల కోసం దిగే క్రమంలో బస్సు నుంచి కింద పడితే తననే తిడుతున్నారని బాధిత మహిళ వాపోయింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news