దేశవ్యాప్త కులగణనపై కేంద్రం ఇటీవల కీలక ప్రకటన చేసింది. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణన చేపడతామని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ‘క్యాస్ట్ సెన్సస్ పాలిటిక్స్’ హీటెక్కాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
అనంతరం రాష్ట్రపతికి పంపించారు.దీనిపై తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు శుక్రవారం గవర్నర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఆ తర్వాత మీడియాతో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. కులగణన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని, కులగణనను గతంలో విమర్శించినవారే ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు.రాహుల్ పోరాట ఫలితమే కేంద్ర కేబినెట్ నిర్ణయం అని చెప్పారు.