చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

-

మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది.

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందుక‌ని చికెన్ తిన్నాక పాలు తాగ‌కూడ‌ద‌ని వైద్యులు అంటున్నారు. అయితే క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి గ‌న‌క ఉంటే.. చికెన్ తిన్నా పాలు తాగ‌వ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు.

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగ‌డం వ‌ల్ల సోరియాసిస్‌, లుకోడెర్మా వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయని, అలాగే తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని, క‌నుక ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version