డాక్టర్ ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి…? ఏపీ హైకోర్ట్ ప్రశ్న…!

-

డాక్టర్ సుధాకర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్ట్ ఏదోక రూపంలో షాక్ ఇస్తూనే ఉంది. వారం రోజుల క్రితం ఈ కేసుని సిబిఐ కి ఇచ్చిన ఏపీ హైకోర్ట్ ఇప్పుడు అతని ఆరోగ్యం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం లేని తనను మెరుగైన చికిత్స కోసం తక్షణం వేరే ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సుధాకర్ కోరారు.

ఈ మేరకు ఆయన హైకోర్ట్ లో రిట్ పిటీషన్ కూడా దాఖలు చేసారు. కోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన హైకోర్ట్ ని కోరారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ఆయన చేర్చారు. అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తాను లేఖ రాసా అన్నారు.

ఇక దీనిపై నేడు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా అతను పోలీస్‌ కస్టడీలో ఉన్నారా.. జుడిషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని ఆదేశించింది. దీనితో స్పందించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు గానూ రెండు రోజుల గడువు అడగగా ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని ప్రశ్నించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version