ఎక్స్‌అఫీషియో ఓటు అంటే ఏంటీ…? ఇది ఎలా గుర్తిస్తారు…?

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఎక్స్ అఫీషియో ఓటు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు దీని గురించి జనాలకు పెద్దగా పరిచయం లేదు. ఈ నేపధ్యంలో అసలు ఈ ఓటు అంటే ఏంటీ అనే చర్చ జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటి మేయర్లకు జరిగే ఎన్నికల్లో ఈ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు అనేది కీలకంగా మారింది.

అసలు ఈ ఓటు అంటే ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.

పైన పేర్కొన్న పదవుల ఎంపికలో ఒక్క ఓటు మెజారిటీకి తక్కువ ఉన్నా సరే ఎస్ అఫీషియో ఓటుతో ఎన్నుకుంటారు. అంటే అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, శాసన మండలి నియోజకవర్గం పరిధిలో ఏదైనా మున్సిపాలిటి, లేదా నగర పాలక సంస్థ ఉంటే, ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎన్నిక అవుతారు.

ఒకవేళ వారి నియోజకవర్గంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మున్సిపాలిటీలు లేదా నగరపాలక సంస్థలు ఉంటే ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లు గా గెలిచిన వారితో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటుగా వారు కూడా ఉంటారు. చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌, మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది.

ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. తెలంగాణాలో తెరాసకు ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఎక్కువగా ఉంది. శాసన సభలో 120 సీట్లు ఉండగా, 105 మంది ఎమ్మెల్యేలు, మండలిలో టీఆర్‌ఎస్‌కు 34 మంది, 17 లోక్‌సభ స్థానాలుండగా, టీఆర్‌ఎస్‌కు 9 మంది ఉన్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిపై తెరాస పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో అక్కడ జరిగిన సర్వ సభ్య సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version