ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి 18 మంది ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇచ్చారు. మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా 18 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో కేబినేట్ తీర్మానం ఆమోదించిన తర్వాత శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై రోజు అంతా జరిగిన చర్చ జరిగింది.
ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జగన్ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే దీనిపై అసెంబ్లీలో చర్చ అనంతరం ఓటు జరగగా 18 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. రద్దు తీర్మానానికి నిర్వహించిన ఓటింగ్ లో భాగంగా 133 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసారు. జనసేన ఎమ్మెల్యే రాపాక కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. అయితే 18 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్ళలేదు.
జగన్ ప్రవేశపెట్టిన మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించి అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టిన వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలకు జగన్ సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. వైఎస్ పై అభిమానంతో ఓటింగ్ కి దూరంగా ఉన్నామని, మండలి లో జరిగే చర్చలు తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని వారు చెప్పినట్టు సమాచారం.
ఇప్పుడు మండలి రద్దు తో వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచినట్టు అవుతుందనే సభకు ఎమ్మెల్యేలు హాజరు కానట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఓటింగ్ సమయంలో అసెంబ్లీ లాబీలోనే ఉన్నారు. ఇక ఓటింగ్ కి ముందే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. జగన్ కి మద్దతు ఇచ్చిన గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా సభకు హాజరు కాలేదు.