Good To Know : గ్రాట్యుటీ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?

-

గ్రాట్యుటీ అంటే చాలా మంది పీఎఫ్ ఇచ్చే డబ్బు అనుకుంటారు. కానీ.. పీఎఫ్‌కు గ్రాట్యుటీకి సంబంధమే లేదు. గ్రాట్యుటీ అంటే మీరు పని చేసిన కంపెనీలో మీ సేవలకు బదులుగా కంపెనీ చెల్లించే మొత్తాన్నే గ్రాట్యుటీ అంటారు. రిటైర్ అయ్యాక లేదంటే మధ్యలో ఉద్యోగం వదిలేసినా.. లేక మధ్యలో కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసినా కంపెనీ సదలు ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. కాకపోతే ఈ గ్రాట్యుటీ చెల్లింపులో కొన్ని కండీషన్లు ఉన్నాయి.

1972 లో కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్‌ను రూపొందించింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీ ఉద్యోగులకు గ్రాట్యుటీని చెల్లించాల్సిందే. యాక్ట్‌లోని నిబంధనలు సంస్థలు, ఉద్యోగులకు వర్తిస్తాయి. అయితే.. గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థలో కనీసం 5 ఏళ్ల సర్వీస్ చేసి ఉండాలి. అలా అయితేనే గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. సంవత్సరం సంవత్సరానికి జాబ్ మారే వాళ్లకు మాత్రం గ్రాట్యుటీ అందని ద్రాక్షే.

గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారంటే.. 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏ, సర్వీస్ పీరియడ్‌ను కలిపి గ్రాట్యుటీని లెక్కిస్తారు. 6 నెలల కంటే ఎక్కువగా చేసినా దాన్ని సంవత్సరం కిందికే లెక్కిస్తారు. ఉదాహరణకు రాము అనే వ్యక్తి ఓ కంపెనీలో 21 సంవత్సరాలా 7 నెలలు పని చేశాడనుకుందాం. అంటే అతడు మొత్తం 22 ఏళ్లు చేసినట్టు లెక్క. ఆయన 15 రోజుల బేసిక్ శాలరీ 24 వేలు అనుకుందాం. ఆయన డీఏ 26 వేలు అనుకుందాం. ఇప్పుడు 24 వేలు ప్లస్ 26 వేలను కలిపితే 50 వేలు అవుతుంది. ఆ 50 వేలను 15 రోజులతో గుణించాలి. అప్పుడు 7,50,000 అవుతుంది. దాన్ని సర్వీస్ పీరియడ్ 22 ఏళ్లు కాబట్టి.. దానితో గుణించాలి. అప్పుడు 16,500,000 అవుతుంది. దాన్ని మీ పనిదినాలు నెలలో వీక్లీఆఫ్‌లు పోను 26 రోజులతో భాగించాలి. అప్పుడు 6,34,615 అవుతుంది. అంత మొత్తం గ్రాట్యుటీ ఉద్యోగికి అందుతుంది. గ్రాట్యుటీకి మినిమమ్ పరిమితి లేదు కానీ.. గరిష్ఠ పరిమితి మాత్రం ఉంది. అది ఇదివరకు 10 లక్షలు ఉండేది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచారు. అది కూడా పన్ను మినహాయింపు కింది వస్తుంది.

గ్రాట్యుటీకి ఎప్పుడు అప్లయి చేయాలి

ఉద్యోగం మానేసినా.. రిటైర్ అయినా.. నెలలోపులో గ్రాట్యుటీకి అప్లయి చేసుకోవాలి. ఒకవేళ కంపెనీ గ్రాట్యుటీ ఇవ్వకపోయినా.. తక్కువ ఇవ్వజూపినా.. దీనిపై అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version