మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. సరైన టైముకు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే కొందరు రోజులో ఉదయం వ్యాయామం చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. అయితే నిజానికి రోజులో ఏ సమయంలో వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, దాంతో ఎలాంటి నష్టాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం వ్యాయామం చేస్తే…
ఉదయం వ్యాయామం చేయడం వల్ల పలు లాభాలు, నష్టాలు ఉంటాయి. కొవ్వు కరుగుతుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. దేహదారుఢ్యం కావాలనుకునే వారు ఉదయం వ్యాయామం చేయాలి. హైబీపీ, డిప్రెషన్ తగ్గాలనుకునే వారు కూడా ఉదయం వ్యాయామం చేస్తే మంచిది. అయితే ఉదయం వ్యాయామం చేయడం వల్ల గాయాల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే శక్తి స్థాయిలు తక్కువవుతాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. ఉదయం వ్యాయామం చేసే వారికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఇక ఊపిరితిత్తులు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి.
మధ్యాహ్నం వ్యాయామం…
దేహదారుఢ్యం, కండరాల నిర్మాణం జరగాలనుకునే వారు మధ్యాహ్నం లేట్‌గా వ్యాయామం చేయాలి. దీంతో ఎక్కువ సేపు వ్యాయామం చేయవచ్చు. ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అస్తవ్యవస్తమైన జీవనశైలి ఉన్నవారికి మేలు జరుగుతుంది. గాయాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యాయామం ఉద్యోగాలు చేసే వారికి సూట్ అవ్వదు. అదొక్కటే దీనికి ప్రతిబంధకం.
సాయంత్రం వ్యాయామం…
సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల హైబీపీ తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. గాయాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ సాయంత్రం వ్యాయామం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాంతి తక్కువగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోవచ్చు.
కనుక ఎవరైనా సరే.. తమకు తోచిన టైములో వ్యాయామం చేయాలి. దాని వల్ల కలిగే నష్టాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యాయామం చేస్తే.. చేసిన వ్యాయామానికి చక్కని ఫలితం లభిస్తుంది.