కొమురవెల్లి మల్లన్న 4వ వారం పెరిగిన ఆదాయం ఎంతంటే ?

-

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి సంవత్సరం  సంక్రాంతికి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. సంక్రాంతికి మొదలైన ఈ జాతరకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో  శ్రీ మల్లికార్జున స్వామి వారి 4వ ఆదివారం సందర్భంగా రూ.56,12,921 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ పర్పాటకం లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్జీత సేవలు,దర్శనాలు, ప్రసాదాల విక్రయం, గదులు తదితర వాటి ద్వారా శనివారం రూ.4,32,331,ఆదివారం రూ.44,99,038, సోమవారం రూ.6,81,552 ఆదాయం సమకూరినట్లు అని అన్నారు. గత సంవత్సరం 4వ వారానికి రూ.48,49,479 ఆదాయం స్వామి వారి ఖజానాకు వచ్చిందని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి రూ.7,63,442 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. వారితోపాటు సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, ఏఈవోలు గంగా శ్రీనివాస్‌, బుద్ది శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version